రాష్ట్ర శాసనసభను సరైన పద్ధతిలో నడపడం లేదని, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సభా నియమాలను, సమయపాలనను పాటించడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ధ్వజమెత్తింది.
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి శనివారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నాయి. శుక్రవారం బీఏసీలో తీసుకొన్న నిర్ణయాలకు అనుగుణంగా టేబుల్ ఐటమ్స్‌గా మంత్రులు వార్షిక నివేదికలను సభలకు సమర్పించనున్నారు.