ఆదాయం లేదు.. డబ్బుల్లేవు.. జీతాలివ్వలేమంటున్న కాం గ్రెస్ సర్కారు ఉన్న నిధులను ఖర్చు చేయలేక రాష్ర్టాన్ని తిరోగమన దిశలో నడుపుతున్నది. కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించలేకపోతున్నది.
వచ్చే నూతన విద్యాసంవత్సరానికి సమగ్రశిక్ష అధికారులు రూ.1200 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సమగ్రశిక్ష ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తి నిధులతో నిర్వహిస్తున్నాయి.