మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా దత్తాత్రేయుడిని పూజిస్తారు. శ్రీపాదవల్లభుడిగా... శ్రీనృసింహ సరస్వతీగా.. శ్రీ మాణిక్య ప్రభుగా.. శ్రీ స్వామి సమర్థగా.. పూజలు అందుకుంటున్న దత్తాత్రేయుడి జయంతిని �
అత్రి మహాముని సుపుత్రుల కోసం ఘోర తపస్సు ఆచరిస్తాడు. ఆ తపస్సు ఫలించి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమవుతారు. ‘మా అంశతో మీకు ముగ్గురు పుత్రులు కలుగుతారు’ అని వరమిస్తారు.
బ్రహ్మ, విష్ణు, శివ తత్తాలు మూర్తీభవించిన జ్ఞానమూర్తి దత్తాత్రేయ స్వామి. అవధూత సంప్రదాయానికి ఆదిదేవుడిగా వెలిసిన గురు స్వరూపం. మహాభాగవతం ప్రకారం పరమాత్మ 21 అవతారాల్లో దత్తాత్రేయ అవతారం కూడా ఒకటి. తెలంగాణ�