నెలలు గడుస్తున్నా ధాన్యం కాంటాలు వేయడం లేదంటూ, అకాల వర్షంతో ధాన్యం మొలకెత్తుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మొలకెత్తిన ధాన్యం బస్తాలతో NH 365 జాతీయ రహదారిపై బుధవారం ధర్నా నిర్వహించారు.
కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు వరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ధాన్యం కొనగోళ్ల విషయంలో కన్న కష్టాలు పడుతున్నారు.