మరో రెండు, మూడు రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సవరించిన అంచనా వెల్లడించింది. సాధారణంగా ఈ రుతుపవనాల కాలం జూన్ 1వ తేదీన ప్రారంభమవుతుంది.
నైరుతి రుతుపవనాల కదలికలు నెమ్మదిగా ఉండడం, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో ఈ నెలలో వానలు కొంత ఆలస్యంగా కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
సమయానికి ముందే రాష్ర్టానికి రుతుపవనాలు! హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణకే�