Biparjoy | బిపర్జాయ్ ఎఫెక్ట్.. ఈ నెల వానలు తక్కువే.. మారో వారం తప్పని భానుడి ప్రతాపం
నైరుతి రుతుపవనాల కదలికలు నెమ్మదిగా ఉండడం, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో ఈ నెలలో వానలు కొంత ఆలస్యంగా కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
- అరేబియాలో ఏర్పడిన బిపర్జాయ్ సైక్లోన్ ఎఫెక్ట్
Biparjoy | నైరుతి రుతుపవనాల కదలికలు నెమ్మదిగా ఉండడం, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో ఈ నెలలో వానలు కొంత ఆలస్యంగా కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడడం వల్ల తేమ మొత్తం అటు వైపునకు వెళ్లిపోవడంతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు పెరిగినట్లు చెప్పారు. ఫలితంగా జూన్ మాసంలో వానలు కురిసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల కదలికలు నెమ్మదిగా ఉండటం, దానికితోడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఈ నెలలో కురవాల్సిన వానలు కొంత ఆలస్యంగా కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకడం జరుగుతుందని, రుతుపవనాలు కేరళను తాకిన 10 రోజులకు అనగా.. జూన్ 10న తెలంగాణకు రుతుపవనాలు రావడం జరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారిణి శ్రావణి తెలిపారు. అయితే, ఈసారి రుతుపవనాలు కేరళను 8న తాకడం వల్ల తెలంగాణలో 18న రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ మధ్యలోనే అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడటం వల్ల తేమ మొత్తం అటువైపు వెళ్లిపోవడంతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. దీని ఫలితంగా ఈ సంవత్సరం జూన్ మాసంలో వానలు కురిసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మరో వారం పాటు తప్పని ఎండలు..
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను వల్ల గాలిలోని తేమ మొత్తం అటు వైపు వెళ్లిపోవడంతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడటం, దీనికి తోడు కిందిస్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండటంతో రాబోయే మరో వారం, పది రోజుల వరకు ఎండల తీవ్రత తప్పదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్లో 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వేడిగాలులు వీస్తుండటంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అరేబియాలో ఏర్పడిన తుఫాను బలహీనపడి, పూర్తిగా తొలగిపోతే తప్ప.. రుతుపవనాల కదలికలో వేగం పెరిగే అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

