నా యనా, ఎవరి బలహీనతలకు, ఎవరి అజ్ఞానానికి వాళ్ళే బాధలు పడాలి. నీ చర్యల ఫలితం నువ్వే అనుభవించాలి. ఇతరులను నిందించిన ప్రయోజనం ఏముంది? ఒకళ్లను చూసి ఈర్ష్యపట్టం, నీ కష్టాలకు ఇతరుల సంకుచిత స్వభావం కారణం అనుకోవటం!
నది జీవితం వంటిది అన్నాం. నది బిందువుగా మొదలవుతుంది. జీవితం బిందువుగా మొదలవుతుంది. నదిలో ఉపనదులు కలుస్తాయి. విశాలం అవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి. విశాలం అవుతుంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అయి