బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యమ నాయకుడు మన్నె క్రిశాంక్‌పై మరో కేసు నమోదైంది. సోం డిస్టిలరీ అండ్ బ్రూవరీ కంపెనీపై చేసిన ఆరోపణలపై భోపాల్ కోర్టు నుంచి క్రిశాంక్‌కు నోటీసులు పంపించారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ‘సోం డిస్టిల్లరీ అండ్ బ్రూవరీ’ కంపెనీ 1998 నుంచి పలు దఫాలుగా రూ.575 కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు.