Sigachi Industries | సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మందికిపైగా గాయపడ్డారు.
PM Modi | సంగారెడ్డి జిల్లా ఇండస్ట్రియల్ పార్కులోని సిగాచి కెమికల్స్ (Sigachi Industries) పరిశ్రమలో పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలంలోని పాశ మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్కులోని సిగాచి కెమికల్స్ (Sigachi Industries) పరిశ్రమలో సోమవారం ఉదయం ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది.
పఠాన్‌చెరు మండలం పాశ మైలారం పారిశ్రామిక వాడలో (Pashamylaram Industrial Park) భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్కులోని సిగాచి కెమికల్స్ (Sigachi Industries) పరిశ్రమలో సోమవారం ఉదయం ఒక్కసారిగా రియాక్టర్ (Reactor Blast)పేలిపోయింది.