ఆటపాటలతో ఇన్నాళ్లూ ఇళ్లలో సందడి చేసి పిల్లలందరూ ఇక బడిబాట పట్టనున్నారు. పాఠశాలలకు, విద్యార్థులకు బుధవారంతో వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచి తరగతి గదుల తలుపులు తెరుచుకోనున్నాయి.
విద్యను వ్యాపారంగా మలిచే ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాంలు, బెల్టులు, స్టేషనరీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.