కౌంటర్లు తెరిస్తే కఠిన చర్యలే!
విద్యను వ్యాపారంగా మలిచే ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాంలు, బెల్టులు, స్టేషనరీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.
- ప్రైవేటు స్కూళ్లకు విద్యాశాఖ అల్టిమేటం
- పుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ విక్రయానికి వీలులేదు
- నిబంధనలు అతిక్రమిస్తే కేసులు, స్కూల్ రిజిస్ట్రేషన్ రద్దు
- డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, స్కూల్ ఇన్స్పెక్టర్లతో తనిఖీ బృందాలు
సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ) : విద్యను వ్యాపారంగా మలిచే ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాంలు, బెల్టులు, స్టేషనరీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. అధిక ధరలతో ప్రతి విద్యాసంవత్సరంలో సొమ్ము చేసుకుంటున్న స్కూళ్ల ఆగడాలకు బ్రేకులు వేయడానికి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, డిప్యూటీ స్కూల్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీ బృందాలు సిద్ధమయ్యాయి. ప్రత్యేక కౌంటర్లు తెరిచి వ్యాపారం చేసే స్కూళ్లను గుర్తించి.. కేసులు నమోదు చేయడం, స్కూల్ అనుమతి రద్దు చేయడం వంటి తీవ్ర చర్యలు కూడా తీసుకోనున్నారు. ఎటువంటి స్కూళ్లల్లోనైనా విద్యకు సంబంధించిన సామగ్రి విక్రయించడానికి వీలు లేదని డీఈవో రోహిణి స్పష్టం చేశారు.
8వేలకు పైగా పాఠశాలలు..
నగరంలో సుమారు 8వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయి. ప్రతి ఏడాది తల్లిదండ్రులకు పిల్లలను చదివించడం కత్తిమీద సాములా మారింది. ఎల్కేజీ అడ్మిషన్ డొనేషన్కు సైతం లక్షలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇక ఫీజులు లక్షల్లోనే… ఇంతటితో ఆగకుండా కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలు ధరించే యూనిఫాంలు, రాసుకునే పెన్నులు, చదివే పుస్తకాలు, ఇతర స్టేషనరీ అంతా తామే అమ్ముతామని తమ దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు వేల రూపాయలు గుమ్మరించి.. యాజమాన్యాలు కొనుగోలు చేయమన్న ప్రతీది కొనాల్సిన పరిస్థితి వస్తున్నది. జూన్ వచ్చిందంటే పిల్లల చదువు, పుస్తకాల ఫీజులు గుర్తొచ్చి బెంబేలెత్తుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు స్కూళ్ల ఆగడాలకు కొంతనైనా అడ్డుకట్ట వేసేందుకు అధికారులు దృష్టి సారించడంపై పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
20 లక్షల వరకు జరిమానా విధిస్తాం
ప్రైవేటు స్కూళ్లల్లో పుస్తకాలు, స్టేషనరీ విక్రయించడం నేరం. నిబంధనలు అతిక్రమిస్తే స్కూల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం. అవసరమైతే 20 లక్షల వరకు జరిమానా విధిస్తాం. నిబంధనలు పాటించాలి. విద్యాసంస్థలు ఎప్పుడూ లాభాపేక్ష లేకుండా కొనసాగాలి. జిల్లాలో ఏ స్కూల్లోనైనా పుస్తకాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
-సుశీంధర్ రావు, డీఈవో, రంగారెడ్డి
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

