ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ఏ ఒక్కరూ ఉద్యమ నేత బాటలో నడవడానికి ముందుకు రాలేదు. మహామహులమని చెప్పుకొనే వారంతా ఆనాడు ఆంధ్రా పెత్తందారుల కింద అణిగిమణిగి ఉన్నారు
ప్రజలకు ఏదైనా చేయాలంటే వారి ఆకాంక్షలను పసిగట్టి వారి ఉన్నతికి కృషి చేయ గలగాలి. కానీ ఏదీ చేయకుండా, అధికార దాహంతో కేసీఆర్ మీద విద్వేషాన్ని నింపుకుంటే.. అటువంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారు.
ఆరున్నర దశాబ్ధాల అణచివేత మూలంగా తెలంగాణ అన్ని రంగాల్లో దోపిడి, అసమానతలకు గురైన సంగతి తెలిసిందే. సమైక్య పాలనలో అంతులేని నిర్లక్ష్యం వల్ల అనేక మంది బడుగు, బలహీన వర్గాల పిల్లలు బడులకు, చదువులకు దూరమయ్యారు.