వెయ్యేండ్లు విదేశీయుల ఆక్రమణ, నిరంకుశ పరిపాలన కింద నలిగిన భారతదేశం తన సంస్కృతి, చరిత్రను మాత్రం జారవిడుచుకోలేదు. శతాబ్దాల వారసత్వ, జాతీయ సంపదను కాపాడుకున్నది.
ఐఐటీలతో సహా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో హిందీ లేదా ప్రాంతీయ భాషలలో బోధన సాగించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సూచించడం తీవ్ర అభ్యంతరకరం.