దేశంలోని ప్రతి ప్రాంతీయ భాష భారతీయతకు ఆత్మగా బీజేపీ భావిస్తుంది. అన్ని భాషలను మేము గౌరవిస్తాం. భాషలను గౌరవిస్తే భవిష్యత్తు భారతం బాగుంటుంది.
-గురువారం రాజస్థాన్ పార్టీ నేతలతో వర్చువల్ భేటీలో ప్రధాని మోదీ
వేర్వేరు రాష్ర్టాల ప్రజలు మాట్లాడుకొనేటప్పుడు ఇంగ్లిష్, స్థానిక భాషల్లో కాకుండా హిందీలోనే తప్పక మాట్లాడాలి. దేశ ఐకమత్యం కోసం హిందీని ముఖ్య భాగం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
–ఏప్రిల్ 8న పార్లమెంటరీ కమిటీ భేటీలో హోంమంత్రి అమిత్ షా
ఇప్పటికే మనం హిందీని అధికార భాషగా వాడుతున్నాం. అయితే, దాన్ని జాతీయ భాషగా ప్రకటించాల్సిన సమయమొచ్చింది. ప్రపంచంలో ప్రతీ దేశానికి ఓ జాతీయ భాష ఉన్నది. మనకూ అలా ఉండాలి.
–ఏప్రిల్ 29న బీజేపీ ఎంపీ ఎరన్న కడాడీ
ఒక దేశం, ఒక పన్ను లాగా.. ఒక దేశం, ఒక భాషను భారత్‌లో అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.
–ఏప్రిల్ 16న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఏపీ అబ్దుల్లకుట్టి
హిందీలో మాట్లాడని వారు భారత్‌ను వదిలి వేరే దేశాల్లోకి వెళ్లిపోవాలి. హిందీని ప్రేమించలేని వారు విదేశీయుల కిందే లెక్క. –ఏప్రిల్ 29న యూపీ మంత్రి, బీజేపీ నేత సంజయ్ నిషాద్