ప్రతి క్షణం మరుక్షణంలో కరిగిపోతుంది. కానీ, ఆ క్షణంలో జరిగే కొన్ని సంఘటనలు కొంతకాలం గుర్తుంటాయి. విశేషాలు ఆవిష్కృతమైతే.. చాలాకాలం నిలిచి ఉంటాయి. 2023లో అరడజన్ మందికిపైగా తారలు టాలీవుడ్ కోటలో పాగావేశారు.
‘సామజవరగమన’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది మలయాళీ సుందరి రెబ్బా మోనికా జాన్. శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్