Year End 2023 | ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసిన కొత్త భామలు వీళ్లే!
ప్రతి క్షణం మరుక్షణంలో కరిగిపోతుంది. కానీ, ఆ క్షణంలో జరిగే కొన్ని సంఘటనలు కొంతకాలం గుర్తుంటాయి. విశేషాలు ఆవిష్కృతమైతే.. చాలాకాలం నిలిచి ఉంటాయి. 2023లో అరడజన్ మందికిపైగా తారలు టాలీవుడ్ కోటలో పాగావేశారు.
Year End 2023 | ప్రతి క్షణం మరుక్షణంలో కరిగిపోతుంది. కానీ, ఆ క్షణంలో జరిగే కొన్ని సంఘటనలు కొంతకాలం గుర్తుంటాయి. విశేషాలు ఆవిష్కృతమైతే.. చాలాకాలం నిలిచి ఉంటాయి. 2023లో అరడజన్ మందికిపైగా తారలు టాలీవుడ్ కోటలో పాగావేశారు. వీరిలో కొందరు అంద చందాలతో ఆకట్టుకుంటే, మరికొందరు అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. వచ్చే ఏడాదినీ తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధం అంటున్న నవతారల సంగతులు ఇవి..

అందాల సాక్షి
‘ఏజెంట్’ సినిమాలో అఖిల్‌తో జట్టుకట్టిన నటి సాక్షి వైద్య. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డా.. సాక్షి సౌందర్యానికి మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నటనతోపాటు డ్యాన్సులూ ఇరగదీయడంతో ముంబాయి బొమ్మను వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి. వరుణ్‌తేజ్ హీరోగా వచ్చిన ‘గాండీవధారి అర్జున’ సినిమాలోనూ సాక్షి కథానాయికగా మెప్పించింది. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్నది. మరిన్ని స్క్రిప్ట్‌లు వింటున్నదట. మొత్తంగా 2024లో సాక్షి మరిన్ని చిత్రాలతో అలరించడం ఖాయంగా కనిపిస్తున్నది.

నూపుర్.. సూపర్
సామాజిక మాధ్యమాల్లో ఏనాడో సెలెబ్రిటీ హోదా దక్కించుకున్న నూపుర్ సనన్ టాలీవుడ్లో అరంగేట్రం చేసింది. రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో తన నటనతో మెప్పించింది. బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటున్నది. ప్రస్తుతం మంచు విష్ణు కథానాయకుడిగా వస్తున్న ‘భక్త కన్నప్ప’లో హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. మరిన్ని చర్చల దశలో ఉన్నాయట.

బిజీ అయిపోతుందేమో!
కన్నడ భామలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఆశికా రంగనాథ్ కూడా అక్కడి సౌందర్యమే! కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’లో హీరోయిన్గా నటించి తెలుగువారికి పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా నాగార్జున సినిమాలో చాన్స్ కొట్టేసింది. ఆయన హీరోగా త్వరలో రాబోతున్న ‘నా సామిరంగ’లో కథానాయికగా ఆశికా కనిపించనుంది. వచ్చే ఏడాది టాలీవుడ్లో ఆశికా బిజీ అవుతుందనడంలో సందేహం లేదంటున్నాయి సినీవర్గాలు.

మంచి మార్కులు కొట్టేసింది!
మాలీవుడ్, కోలీవుడ్‌లో ఫేమస్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న రెబ మౌనిక జాన్ ఈ ఏడాది టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీవిష్ణు కథానాయకుడిగా వచ్చిన ‘సామజ వరగమన’ సినిమాలో హీరోయిన్గా మంచి నటనను కనబరిచింది. ఫ్యామిలీ లుక్‌తో క్లాస్ మార్కులు కొట్టేసిన మౌనికకు ఆఫర్లు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

