కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో (Machareddy) యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా కొరత తీర్చాలంటూ మాచారెడ్డి ఎక్స్ రోడ్డులో ధర్నా నిర్వహించారు. సరిపడా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్తండా అటవీ ప్రాంతంలో పులి (Tiger) సంచారం కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతంలో ఆవులపై దాడిచేసింది. గుర్తించిన తండావాసులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.