ఏడు పదుల వయసు దాటాక కృష్ణారామా అనుకోవడం మనవాళ్ల సంప్రదాయం. ఎనభై దాటాక.. తారక మంత్రం పఠించడమూ భారంగా అనిపిస్తుంది. ఈ పెద్దావిడ మాత్రం తొంభైమూడేండ్ల వయసులోనూ తన అభిరుచిని ఆస్వాదిస్తున్నారు.
మా కుటుంబసభ్యులే ఓ యాభై మంది దాకా ఉండేవారు. అమ్మతోపాటు చిన్నమ్మలు, అత్తయ్యలు అందరూ కబుర్లు చెప్పుకొంటూ పనులు చేసుకునేవారు. ఇక మా ఈడు పిల్లలం ఆటలే ఆటలు! ఎవరైనా వచ్చి చూస్తే.. ఓ మనిషి చనిపోయిన ఇల్లులా ఉండేది �