కృష్ణమ్మ వరద జోరుతో నాగార్జున సాగర్ జలాశయం తొణికిసలాడుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,94,009 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా శుక్రవారం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగించారు.
నాగార్జునసాగర్‌కు పైనుంచి వరద పోటెత్తడంతో పూర్తిస్థాయిలో డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువన ఉన్న కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకుగానూ గురువారం 585.90 (300.0315