తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాలీహౌజ్తో పూలను సాగు చేస్తున్న రైతులు వారు పండిస్తున్న పూలను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. తోటలో పండించిన పూలను కూలీలు సేకరించి ఓ గదిలో భద్రపరుస్తారు.
సంప్రదాయ సాగు పద్ధతుల నుంచి ఆధునిక వ్యవసాయం వైపు మళ్లుతున్నాడు అన్నదాత. ఇటీవల కాలంలో పల్లెల్లో నూతన వ్యవసాయం, యంత్రాల వినియోగం వినియోగం అమాంతం పెరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.