‘జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యౌవనము, వార్ధక్యము ఉన్నట్లే మరొక దేహప్రాప్తి (మరణము) కలుగుతుంది. ధీరుడు అంటే ప్రాజ్ఞుడైనవాడు ఈ విషయం పట్ల మోహితుడు కాడు’ అని అంటున్నాడు కృష్ణపరమాత్మ.
అంతర్గత చైతన్యాన్ని ‘ఎరుక’ లేదా ‘తెలివి’ లేదా ‘వివేచన’ ద్వారా గుర్తించి ఆ వైపు పురోగమించాలి. అలా గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు అధః పాతాళంలో కూరుకుపోతాడు.
తనకు తెలియని దానిని తెలిసిన వారిని అడిగి తెలుసుకునే ప్రశ్నా విధానానికి భారతీయ విద్యావిధానం పెద్దపీట వేసింది. సందేహం వచ్చినప్పుడు సమర్థుడైన గురువును ఆశ్రయించి ప్రశ్నించాలి. నిజాన్ని తెలుసుకోవాలనే కుత�