ఎంపిక మనదే!
అంతర్గత చైతన్యాన్ని ‘ఎరుక’ లేదా ‘తెలివి’ లేదా ‘వివేచన’ ద్వారా గుర్తించి ఆ వైపు పురోగమించాలి. అలా గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు అధః పాతాళంలో కూరుకుపోతాడు.
ఒక పులి మంచిపులిగా గాని, చెడ్డపులిగా గాని మారాలని అనుకోదు. అది అచ్చంగా పులిగానే బతుకుతుంది. పులిగానే చస్తుంది. అంతే! మరి మనిషి?
అంతర్గత చైతన్యాన్ని ‘ఎరుక’ లేదా ‘తెలివి’ లేదా ‘వివేచన’ ద్వారా గుర్తించి ఆ వైపు పురోగమించాలి. అలా గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు అధః పాతాళంలో కూరుకుపోతాడు. ఈ రెండు భిన్న ధ్రువాల మధ్య ఏవైపు పురోగమించాలో నిర్ణయించుకునే పరిపూర్ణ స్వేచ్ఛ మనిషికి ఉంది. సాహసంతో వ్యవహరించి, అవకాశాలను అందిపుచ్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే.. విజయం.
అవరోధాలకు భయపడి, ప్రలోభాలకు లోబడితే నిర్వ్యాపారత, అచేతనత్వం. దానితో గమ్యం, గమనం లేని స్థితిలో బతుకు బండి లాగించడం. అంతిమ ఫలితం ..అపజయం. ఇందులో తనకేది కావాలో తనే నిర్ణయించుకోవాలి. మనం మంచిగా ఉండాలో, చెడుగా బతకాలో.. దయ్యమే అవుతామో, దేవుడిగా పూజలందుకుంటామో.. అనేది స్వేచ్ఛ మనకిచ్చే ఓ తిరుగులేని అవకాశం.
సమస్యలు ఎదురైన వేళ భయపడి తప్పుకొనేవారు కొందరు. సమస్యలను సాదరంగా ఆహ్వానించి, ధైర్యంగా ఎదుర్కొని ఘనవిజయం సాధించి ఆనందించేవారు మరికొందరు. ఈ రెండు వర్గాల మధ్య తేడా ఒకటే.
ఎదురైన సమస్య ఓ ‘ప్రాబ్లం’ అనే భావనలో మొదటి వర్గం ఉంటే, ప్రతీ సమస్య మరిన్ని అవకాశాలను ముందుకు తెస్తుందనే భావనలో రెండో వర్గం ఉంటుంది. మొదటి వర్గం సమస్యకు ‘రియాక్ట్’ అయితే, రెండో వర్గం సమస్యలకు ‘రెస్పాండ్’ అవుతుంది. అంతే తేడా.
మన స్థాయి ఏదైనా.. అంతకన్నా ఉన్నత స్థాసానికి చేరుకోవడం… ఆ స్థాయినీ అధిగమించి పరిణతి సాధించడం సంభవమే. నిరంతర తపన, పట్టుదల, కష్టనష్టాలను భరించగలిగే మానసిక సంసిద్ధత, ఇంతకుముందు సాధించిన విజయాలతో లభించే స్ఫూర్తి… ఆ స్ఫూర్తితో కలిగిన ప్రేరణ వల్ల సమకూరిన అనుభవాలు… ఆ అనుభవాల ప్రాతిపదికగా లభించిన మరిన్ని విజయాలు.. వాటితో పొందిన తృప్తి.. ఆ సంతృప్తితో మరో ఉన్నతమైన లక్ష్య నిర్దేశన.. ఇలా… ఇలా… ముందుకు సాగి జీవితం సఫలం చేసుకోవాలని భారతీయ విజ్ఞానశాస్త్రం ప్రబోధిస్తున్నది.
– పాలకుర్తి రామమూర్తి (‘ఉత్పాదనా సామర్థ్యంతో జీవించడం ఒక కళ’ నుంచి)
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

