1 Nenokkadine | థియేటర్లలో మళ్లీ ‘రాక్‌స్టార్’ రచ్చ.. రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న మహేశ్ బాబు ‘1 నేనొక్కడినే’!
1 Nenokkadine | సమ్మర్లో పెద్ద సినిమాలేవి విడుదలకు లేకపోవడంతో టాలీవుడ్లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ జోరుగా సాగుతోంది. స్టార్ హీరోల పాత సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.
1 Nenokkadine | సమ్మర్లో పెద్ద సినిమాలేవి విడుదలకు లేకపోవడంతో టాలీవుడ్లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ జోరుగా సాగుతోంది. స్టార్ హీరోల పాత సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే, ప్రిన్స్ మహేశ్ బాబు కెరీర్లో కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచిన ‘1 నేనొక్కడినే’ (1 Nenokkadine) మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమాను అత్యాధునిక 4K అల్ట్రా హెచ్డీ వెర్షన్లో, అద్భుతమైన సౌండ్ క్వాలిటీతో ప్రపంచవ్యాప్తంగా భారీగా రీ-రిలీజ్ చేయబోతున్నారు.
లెజెండరీ యాక్టర్, సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ 4K రీ-రిలీజ్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ చూసిన అభిమానులు రాక్‌స్టార్ గౌతమ్ ఈసారి థియేటర్లను తగలబెట్టడం ఖాయం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 2014 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం, అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ అనుభూతిని పరిచయం చేసింది. ఆ సమయంలో కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించనప్పటికీ, కాలక్రమేణా టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మైండ్-గేమ్ థ్రిల్లర్‌గా, కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మహేశ్ బాబు ప్రదర్శించిన అద్భుత నటన, క్లిష్టమైన స్క్రీన్‌ప్లే సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.
ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (టాలీవుడ్ డెబ్యూ) కథానాయికగా నటించగా, మహేశ్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్నప్పటి మహేశ్ పాత్రలో కనిపించి మెప్పించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

