రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఆరంభ శూరత్వంగానే కనిపిస్తున్నది. వివిధ శాఖల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై తొలుత హడావుడి చేస్తున్నా, ఆ తర్వాత కిమ్మనని పరిస్థితి దాపురించింది.
నర్సింగ్ కౌన్సెలింగ్లో గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దరఖాస్తు చేయకపోయినా కౌన్సెలింగ్లో పేరు వచ్చిందని ఏడో జోన్ పరిధిలోని 2021, 2022 బ్యాచ్లకు చెందిన పలువురు నర్సింగ్ ఆఫీసర్లు వాపోతున్నారు.