రాజమౌళి సినిమాలో.. విలన్ను టార్గెట్ చేసిన ‘ఈగ’ను తెగ ఎంజాయ్ చేశాం! ఆ ‘ఈగ’కు మేమేం తక్కువ కాదంటున్నాయి దోమలు. నలుగురిలో ఒకరిని టార్గెట్ చేయడం వాటికి సరదా! రక్తం రుచి నచ్చితే.. ఎంత అదరగొట్టినా అవి బెదరవు.
ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది.