జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఎస్సీ గురుకులం నుంచి 450 మందికిపైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ రాయగా, ఇందులో 86 మంది ర్యాంకులు పొందారు.
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు.