మైనింగ్‌కు సంబంధించిన చిన్నచిన్న డీవియేషన్లకు కూడా గనుల శాఖ అధికారులు భారీ జరిమానాలు విధిస్తుండటంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని క్రషర్ల యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
సాగునీటి వనరులు, ఇసుక రీచ్‌లు ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా అరుదైన ఖనిజ సంపదకు కేంద్ర బిందువు కానున్నది. తాజాగా ఈ సంపద వెలుగు చూడటంతో రాష్ట్ర గనుల శాఖ మరింత పరిశోధన దిశగా అడుగులు వేస్తున్నది.