ఆయన కవిత్వంలో ఒక చమత్కారం ఉంటుంది. ఆయన మాటల్లో ఒక రకమైన మ్యాజిక్ ఉంటుంది. ఆయన ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. అప్పుడే ఆశువుగా ఒక పద్యం చెప్తారు. వెంటనే గమ్మత్తయిన ఒక ఛలోక్తి విసురుతారు.
ఆయన మధురమైన గేయాలతో కంటతడి పెట్టిస్తాడు. ప్రౌఢమైన పద్యాలతో మహా పండితులను కూడా హడలెత్తిస్తాడు. ఆయన మృదు మధురమైన ప్రసంగాలతో సభికులను కట్టిపడేస్తాడు. ఆశు కవిత్వంతో అందరినీ అలరిస్తాడు. అమోఘమైన కవితా ప్రవాహ�