మండలంలోని ఎర్రబెల్లి లింగమంతుల స్వామి జాతర వైభవంగా జరుగుతున్నది. సోమవారం తెల్లవారు జామున మాణిక్యాల దేవి, లింగమంతుల స్వామి కల్యాణోత్సవాన్ని యాదవులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
కనుమరుగవుతున్న నాటి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జీవం పోసి నేటి తరానికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు సూర్యాపేట మున్సిపాల్టీ తనవంతు ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.