హైడ్రా బాధిత కుటుంబాల్లో చీకటి అలుముకున్నది. సరిగ్గా సెప్టెంబర్ 8న గుట్టలబేగంపేటలోని సున్నం చెరువు వద్ద హైడ్రా చేపట్టిన కూల్చివేతలలో ఏకంగా 60 కుటుంబాల జీవితాలు రోడ్డునపడ్డాయి.
కూలీనాలీ చేసుకుంటూ నివాసముంటున్న వారిని నిర్దాక్షిణ్యంగా గుడిసెలు ఖాళీ చేయించి వాటిని కూలగొట్టడమే కాకుండా బాధితులపై హైడ్రా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.