రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీలోకి శనివారం 1,04,879 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విస్తారంగా వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతున్నది. భిక్కనూర్, కామారెడ్డి, గాంధారి, లింగంపేట, బాన్సువాడ, రాజంపేట, దోమకొం�