నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి ఆయా పంటల సాగుకు అవసరమైన నీరందించేలా జిల్లా నీటి పారుదల శాఖ సిద్ధంగా ఉంది. ఏటా ఈ సమయంలో రైతాంగం ఆరుతడి పంటల సాగుకే మొగ్గు చూపుతున్నది.
గతేడాది భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 2022, జూలై 12వ తేదీన ఎన్నడూ లేనివిధంగా సామర్థ్యానికి మించి, ప్రవాహం రావడంతో ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి నెలకొన్నది.