గూడెం ఎత్తిపోతలపైనే ఆశలు
గతేడాది వరద తాకిడికి కడెం జలాశయం గేట్లు దెబ్బతినగా, యాసంగికి సిద్ధమవుతున్న రైతాంగం గూడెం ఎత్తిపోతలపైనే ఆశలు పెట్టుకున్నది. ఎల్లంపెల్లి బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు 30వ డిస్ట్రీబ్యూటరీ కాలువ వద్ద ఎత్తిపోయనుండగా, అక్కడి నుంచి దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల పరిధిలోని 30 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది.
- కేసీఆర్ సర్కారులో మైల్డ్ స్టీలు పైపులైన్ ఏర్పాటు
- మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు చొరవతో సమస్యకు పరిష్కారం
- మూడు మండలాల్లోని 30 వేల ఎకరాలకు సాగు నీరు
గతేడాది వరద తాకిడికి కడెం జలాశయం గేట్లు దెబ్బతినగా, యాసంగికి సిద్ధమవుతున్న రైతాంగం గూడెం ఎత్తిపోతలపైనే ఆశలు పెట్టుకున్నది. ఎల్లంపెల్లి బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు 30వ డిస్ట్రీబ్యూటరీ కాలువ వద్ద ఎత్తిపోయనుండగా, అక్కడి నుంచి దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల పరిధిలోని 30 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది.
దండేపల్లి, డిసెంబర్24 : రైతన్నలు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే వాగు లు, చెరువులు, వ్యవసాయ బావులపై ఆధారపడిన రైతులు నార్లు పోసుకున్నారు. కడెం, గూడెం ఎత్తిపోతల ఆయకట్టు రైతులు సైతం నార్లు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కడెం పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 683 అడుగుల నీరే ఉంది. దీనికితోడు గత వానాకాలంలో వరద తాకిడికి గేట్లు దెబ్బతినగా, ఈసారి కూడా నీళ్లు అందే అవకాశాలు లేవు. గత యాసంగిలో 28వ డిస్ట్రీబ్యూటరీ వరకు నీరందించడంతో బావులు, కుంటలు, చెరువుల్లో నీరుండి రైతులకు ఢోకా లేకుంటైంది. ఈ యాసంగికి కడెం నుంచి నీరందే అవకాశాలు లేకపోవడంతో రైతులంతా గూడెం ఎత్తిపోతలపైనే ఆశలు పెట్టుకున్నారు.
‘ఎత్తిపోతల’ మరమ్మతులు పూర్తి
దండేపల్లి మండలం గూడెం గోదావరి నది ఒడ్డున నిర్మించిన శ్రీ సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకంలో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు అప్పటి ఎమ్మెల్యే దివాకర్‌రావు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కేసీఆర్ సర్కారులో జీఆర్(గ్లాస్ రీఎన్ఫోర్స్డ్) పైపులను తొలగించి.. మైల్డ్ స్టీలు(ఎంఎస్)పైపులను వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మగూడెం వద్ద నిర్మిస్తున్న రాజీవ్‌సాగర్ నిర్మాణంలో వినియోగించిన ఎంఎస్ పైపులను గూడెం ఎత్తిపోతలకు ఏర్పాటు చేయడం వల్ల సమస్యకు పరిష్కారం లభించింది.
రైతులకు సాగు నీరు అందించేందుకు ఇబ్బంది కాకుండా వేసవిలో 2 కిలో మీటర్ల మేర పైపులైన్లు వేశారు. ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు.ఎల్లంపెల్లి జలాశయ బ్యాక్‌వాటర్‌ను గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా తానిమడుగు సమీపంలోని కడెం ప్రాజెక్టు 30వ డిస్ట్రీబ్యూటరీ కాలువ వద్ద ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి దిగువన ఉన్న 42 కాలువ వరకు దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల పరిధిలోని 30 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

