చాలామందికి వెండి అంటే చిన్నచూపు. నిజానికి ఆభరణంగా అయినా, పెట్టుబడిగా అయినా, వస్తువుగా అయినా.. వెండి వన్నెల ముందు వజ్రమైనా చిన్నబోవాల్సిందే. ఇదో మంచి పెట్టుబడి సాధనం కూడా.
ఇంట్లో ఎన్ని నగలున్నా కొత్త ఆభరణం కనిపించగానే మనసు పారేసుకుంటారు మహిళలు. కాబట్టే, వారిని ఆకట్టుకునేందుకు సరికొత్త డిజైన్లకు ప్రాణంపోస్తారు ఆభరణాల తయారీదారులు.