తనపై వచ్చిన లైంగిక దాడుల ఆరోపణలపై సరిగ్గా తాను దేశం విడిచి వెళ్లిన నెల రోజులకు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ స్పందించారు. ఈ నెల 31న సిట్ విచారణకు హాజరవుతానని ఓ వీడియో ప్రకటనలో తెలిపారు.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారం కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతున్నది. లోక్సభ ఎన్నికల ప్రచారం మొత్తం సెక్స్ స్కాండల్ చుట్టూనే తిరిగింది.