బెంగళూరు, మే 27: తనపై వచ్చిన లైంగిక దాడుల ఆరోపణలపై సరిగ్గా తాను దేశం విడిచి వెళ్లిన నెల రోజులకు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ స్పందించారు. ఈ నెల 31న సిట్ విచారణకు హాజరవుతానని ఓ వీడియో ప్రకటనలో తెలిపారు. ‘విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతా. కోర్టు మీద నాకు నమ్మకం ఉంది. కోర్టు ద్వారా తప్పుడు కేసుల నుంచి నేను బయటపడగలనన్న విశ్వాసం ఉంది. నా మీద నమ్మకం ఉంచండి’ అని ఆయన ఓ వీడియో ప్రకటనలో తెలిపారు. ఈ వీడియోను ఓ కన్నడ టీవీ ఛానల్ సోమవారం ప్రసారం చేసింది. అయితే ఈ వీడియో ప్రకటనను జేడీఎస్ కానీ, ప్రజ్వల్ కుటుంబం కానీ ధ్రువీకరించలేదు.