‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందండి’.. అనే సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఉన్నత విద్యావంతులు సైతం పడిపోతున్నారు. అత్యాశకు పోయి కష్టార్జితాన్ని సమర్పించుకుంటున్నారు.
స్మార్ట్ఫోన్ వచ్చిన తర్వాత కంటికి కనిపించని నేరాలు విస్తృతంగా పెరిగాయి. బాధితులతోనే బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పిస్తూ.. ఏటేటా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్దొంగలు.