ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాజరుకు సంబంధించి అధికారులు నిమిషం నిబంధన అమలు చేయడంతో.. బుధవారం ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షను ఇద్దరు విద్యార్థులు రాయలేకపోయారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు డీఐఈవో(జిల్లా ఇంటర్ విద్యాధికారి) కె. రవిబాబు తెలిపారు.