భారత పౌరసత్వాన్ని వదులుకొంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 2011 నుంచి 2022 వరకు 16,63,440 మంది పౌరసత్వాన్ని వదులుకోగా.. గత ఏడాదే 2,25,620 మంది వదులుకున్నారు.
2011 నుంచి 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది అత్యధికంగా 2,25,620 మంది, 2020లో అత్యల్పంగా 85,256 మంది భారతీయ పౌరసత్వాన్ని వీడినట్లు వెల్లడించింది.