ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ల మంది దీర్ఘకాలిక హెపటైటిస్ బీ తో, 12 మిలియన్ల మంది హెపటైటిస్ సీతో బాధపడుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ వ్యాధిని ఆదిలోనే అంతం చేయడం అత్యంత అవసరం.
మానవ శరీరంలో ఐదు వందలకు పైగా జీవక్రియల్లో పాల్గొనే ముఖ్య అవయవం.. కాలేయం! ఈ భాగాన్ని తీవ్ర ఇబ్బంది పెట్టే సమస్య హెపటైటిస్. ఇన్ఫెక్షన్లు, ఆల్కహాల్ వంటి దురలవాట్లు, జన్యుపరమైన లోపాలు, ఔషధాల దుష్ప్రభావాలు..