కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో వడగండ్ల వాన పడింది. బలమైన గాలులతో వర్షం దంచికొట్టడంతో రైతులకు తీవ్ర నష్టం చేకూరింది.
అకాల వర్షాలు అన్నదాతలను ఆగం జేస్తున్నాయి. గురు,శుక్రవారాల్లో కురిసిన వానలు తీవ్ర నష్టం మిగిల్చాయి. భీమ్గల్ మండలంలోని బాచన్పల్లి, పిప్రి గ్రామాలలో వడగండ్ల వాన కురిసింది.
సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు 184 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందజేసింది. అంతకంటే ఎక్కువగానే పంటనష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు.