ఉపరితల ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
గ్రేటర్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మొన్న అంబర్‌పేట...నిన్న షేక్‌పేట, రాజేంద్రనగర్, నేడు అద్రాస్పల్లి.. ఇలా వరుసగా వీధి కుక్కల దాడి సంఘటనలతో చిన్నారుల తల్లిదండ్రులు హడలిపోతున్నారు.