వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. మూడ్రోజులపాటు ఉతంఠగా సాగిన ఓట్ల లెకింపులో ఎలిమినేషన్ రౌండ్స్తో ఆయన విజయం ఖరారైంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిన నైతిక విజయం తనదేనని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. కౌంటింగ్ హాల్లోని మీడియా పాయింట్ వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.