కర్ణాటకకు చెందిన భరతనాట్య కళాకారిణి విదుషి దీక్ష అరుదైన రికార్డు సృష్టించింది. 170 గంటలపాటు నాన్‌స్టాప్‌గా నృత్య ప్రదర్శన చేసి సత్తా చాటి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
నాదం ఝుమ్మంది.. ఆమె పాదం సయ్యంది. 170 గంటలపాటు నిరంతరాయంగా నాట్యం పల్లవించింది. ఆ నృత్యకారిణి భరతనాట్య అభినయ వేదం.. ఆహూతులను అలరించడమే కాదు.. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకుంది.