బెంగళూరు : కర్ణాటకకు చెందిన భరతనాట్య కళాకారిణి విదుషి దీక్ష అరుదైన రికార్డు సృష్టించింది. 170 గంటలపాటు నాన్‌స్టాప్‌గా నృత్య ప్రదర్శన చేసి సత్తా చాటి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
ఆగస్టు 21 మధ్యాహ్నం 3:30 గంటలకు నృత్యం మొదలుపెట్టిన ఆమె 216 గంటలపాటు ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ గురువారం సాయంత్రం 5:31 గంటల వరకు 170 గంటల వద్ద విరమించింది.