అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల కారణంగా స్టాక్ పెట్టుబడుల్లో మదుపరులు జాగ్రత్త వహిస్తున్నారు. ఇందుకు సంకేతంగా ఏప్రిల్ నెలలో దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి.
అమెరికా ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్ఠానికి తగ్గిందన్న వార్తతో కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున ర్యాలీ జరిపిన స్టాక్ మార్కెట్లు గతవారం తిరిగి ఒడిదుడుకుల బాటలోకి మళ్లాయి.