వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బీజేపీ సర్కారు హడావిడిగా ఆమోదించిందని రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు.
ఎన్నికలకు ముందు వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ స్పందించారు. ఇది రేవ్డీ సంస్కృతి కాకపోతే మరేమిటి? అని నిలదీశారు.
విపక్షాల నోరు నొక్కేయాలన్న ప్రధాన అజెండాతోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత బిల్లును తీసుకొచ్చిందని కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చ�