రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఐదేళ్ల కిందట పనులు ప్రారంభించి, మూడేళ్ల కిందట పూర్తిచేసిన భవనాలను వినియోగంలోకి తీసుకురావడంతో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
తెలంగాణ రా్రష్ట్రంలోనే మొట్టమొదటి మత్స్య పాలిటెక్నిక్ కళాశాలను కూసుమంచి నియోజకవర్గంలోని పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం పరిధి జుఝల్రావుపేట గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు.