CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అభినందన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. భారీ ఏర్పాట్లు, హంగు ఆర్భాటాలతో యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన సభకు సినీ కార్మికులు ముఖం చాటేశారు.
సినిమా రంగ కార్మికులకు వేతనాలు పెంచాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు. పెద్ద బడ్జెట్ సినిమాలకు 30%, చిన్న చిత్రాలకు 15% వేతనాలు పెంచాలని స్పష్టంచేశారు.