అది 1990. అప్పట్లో ఓ పల్లెటూరు. ఆ ఊళ్లో ఒక బడి, నాలుగు పచారీ కొట్లు, పంచాయతీ కార్యాలయంతో పాటుగా... ఆ పల్లె జీవితంలో భాగమయ్యేది ఓ చిన్న క్లినిక్. పిల్లలకి జ్వరం వచ్చినా, చెవిపోటు మెలిపెట్టినా, పెద్దోళ్ల మోకాళ్ల న
డాక్టర్ మామయ్య, డాక్టర్ బాబాయ్, డాక్టర్ పిన్ని.. ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ముద్దు పేర్లు. అంతగా కుటుంబంలో కలిసిపోయేవారు. నాన్న బీపీ ఎంతో, అమ్మ షుగర్ ఏ స్థాయిలో ఉందో పరీక్షించకుండానే చెప్పేవారు ఆయన.